Rudra Trishati Telugu Pdf
అష్టాదశ పురాణాలు: (Astadasa Puranams) అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. పురాణాలు కల్పితాలు కావు. పురాణము అంటే.‘పూర్వకాలంలో ఇలా జరిగింది’ అని అర్థం. మన భారతీయ పురాణాలు అతి ప్రాచీనమైన చరిత్రలను వివరిస్తాయి. భూత, భవిష్యద్వర్తమాన ద్రష్ట అయిన వేదవ్యాసుడు ఈ పురాణాల కర్త.
సృష్టి ఆరంభం నుంచి జరిగిన, జరుగుతున్న, జరగబోవు చరిత్రలను వ్యాసభగవానుడు పదునెనిమిది పురాణాలుగా విభజించి మన జాతికి అంకితం చేసాడు.ఈ పురాణాలు ఏమేమి తెలుపుతాయో వివరంగా తెలుసుకుందాం. 1.మత్స్య పురాణము: శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఈ పురాణాన్ని మనువుకు బోధించాడు. ఇందులో కార్తకేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు., మానవులు ఆచరించదగిన ధర్మాలు.,వారణాసి, ప్రయాగాది పుణ్యక్షేత్రాల మాహాత్మ్యాలు వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో 14,000 శ్లోకాలు ఉన్నాయి. 2.మార్కండేయ పురాణము: ఈ పురాణం మార్కండేయమహర్షి చేత చెప్పబడింది. Skyhooks The Collection Rar. ఇందులో శివ, విష్ణువుల., ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యములు, దుర్గా సప్తశతి (దేవీ మాహాత్య్యము) చండీ, శతచండీ, సహస్రచండీ హోమాల విధానము వివరంగా చెప్పబడ్డాయి.
ఇందులో 9,000 శ్లోకాలు ఉన్నాయి. 3.భాగవత పురాణము: ఈ పురాణాన్ని వేదవ్యాసుడు తన కమారుడైన శుకమహర్షికి బోధించచగా., ఆ శుకమహర్షి దానిని పరీక్షిత్తు మహారాజుకు బోధించాడు. శ్రీమహావిష్ణువు ధరించిన దశావతార చరిత్రలను, శ్రీకృష్ణుని బాల్య లీలా వినోదాలను ఈ పురాణం పన్నెండు స్కంథాలలో వివరిస్తుంది. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి. 4.భవిష్య పురాణము: ఈ పురాణాన్ని సూర్యభగవానుడు మనువుకు బోధించాడు. సూర్యోపాసన విధి., అగ్నిదేవతారాధన విధి, వర్ణాశ్రమ ధర్మాలు ఈ పురాణంలో వివరించబడ్డాయి.